టీ బాగాలేదని.. ముఖంపై పోసి, చావబాదిన డీఎస్పీ!

  • టీస్టాల్ వద్ద టీబ్రేక్ తీసుకున్న పోలీసులు
  • టీ బాగాలేదంటూ బూతులు
  • ముఖంపై పోసి దాడి
టీ బాగాలేదని, అది తెచ్చిచ్చిన పనివాడిపై దానిని పోసి చావగొట్టాడో డీఎస్పీ. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిబ్బందితో కలిసి వెళ్తున్న డీఎస్పీ మార్గమధ్యంలో ఓ హోటల్‌ వద్ద ఆగి బ్రేక్ తీసుకున్నారు. ఈ సందర్బంగా అందరూ టీ ఆర్డర్ ఇచ్చారు. హోటల్ పనివాడు టీ తెచ్చి అందరికీ సర్వ్ చేశాడు.

అయితే, అది తాగిన డీఎస్పీ టీ తెచ్చిచ్చిన వ్యక్తిని పిలిచి దానిని ముఖంపై పోశాడు. టీ బాగాలేదంటూ బూతులు తిట్టాడు. అనంతరం అతడిపై దాడి చేసి చెంపలు వాయించాడు. అతడిని ముందుకు తోస్తూ దాడి చేశాడు. ఈ మొత్తం ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో దూరి హల్‌చల్ చేస్తోంది. వర్కర్‌ ముఖంపై టీపోసి దాడిచేసిన డీఎస్పీపై ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Go Back to Shorts
Tamilnadu
Tea
DSP
assault
worker
bad tea

More Telugu News